బీప్ ... బీప్ బీప్ బీప్ ... బీప్ ... బీప్ బీప్ బీప్. హ్యప్పీ గా ముసుగు తన్ని పడుకుని వుంటే, ఈ అలారం ఎంట్రా బాబూ అని అనిపించిన వెంటనె, 'ఓహ్ మై గాడ్, టుడే జ్ హ్యప్పీ డేస్ రిలీస్ !!!' అని గుర్తొచ్చింది. ఆంతే బద్ధకాన్ని అటు లెఫ్ట్ లెగ్ తో తన్ని, ఇటు రెడీ అవ్వటం మొదలు పెట్టా. బ్రష్ చేస్తూ వుంటే అనిపించింది - "ఒరెయ్, ఒక్కసారి గుర్తు తెచ్చుకో, ఒక్క ఎగ్జాం కైనా ఇలా టైం పెట్టుకుని లేచావా ఎప్పుడైనా ?!?! బాగా పడుకోక పొతే ఎగ్జాం సరిగ్గా రాయలేం అనే (ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే నాక్కూడా అర్ధం కాని !!!) భయంకరమైన లాజిక్ తప్ప ?!?!? ". "ఎనీవేస్ పాస్ట్ ని త్రవ్వితే పావలా ప్రయోజనం కూడా లేదు ... ముందు ఈ రోజు సినిమా కి టిక్కెట్స్ ఎలాగైనా సంపాదించాలి, అదీ మార్నింగ్ షో కే, జై భజ్ రంగ్ బలీ" అనుకుంటూ రెడీ అయిపోయా. లార్డ్ వెంకీ కి ఈ వెంకీ దణ్ణం పెట్టుకుంటుంటే మరో వెంకీ(రవితేజ) గుర్తొచ్చాడు. ఇన్ హిస్ 'ఖడ్గం' ఇస్టైల్, దేవుడితో - "దేవుడా, Today's Wish: ఒక్క టిక్కెట్, ఒకే ఒక్క టిక్కెట్ (would this be a better title for this post?!?!) , I mean నాతో పాటు శ్రావణ్ కి కూడా :P ". బ్రేక్ఫాస్ట్ కూదా లైట్ తీసుకుని బయల్దేరా థియేటర్ కి నాకు నచ్చిన జస్ట్ నార్మల్ ద్రెస్స్ లో.
అనుకున్న టైం 9 కల్లా రీచ్ అయిపోయా. ఐ థింక్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటం అదీ లైన్ లో నించుని టిక్కెట్స్ సంపాదించి, అందులోనూ ఫర్ ది మచ్ ఎవెయిటెడ్ హ్యప్పీ డేస్ - భలే థ్రిల్లింగ్ గా వుంది లే. :-). 3 ఇయర్స్ అండ్ 3 మంత్స్ ఆఫ్ వర్క్ లో, ఏ ఒక్క మీటింగ్ కి గానె, కాంఫరెన్స్ కాల్ కి గానీ టైం లో వెళ్లిన గుర్తులేమీ లేవు !!! ఎంత ఆలోచించినా ఒక్కటే గుర్తొస్తోంది - ఏప్పుడూ దారిలొ వుండగా వచ్చే ఫోన్ కాల్, అందులొ మా colleague - 'Where are you man?!?!? Boss is waiting for you' అనే ముక్కలే తప్ప !!! అప్పటికే ఓ వంద మంది పైనే కాలేజ్ గోయింగ్ వేస్ట్ గైజ్ అండ్, ofcourse ,బ్యూటిఫుల్ girlz అక్కడున్నారు థియేటర్ లోకి అందరికంటే ముందు ఎలా వెళ్లాలా అని వ్యూహ రచనలు చేస్తూ. 'ఆక్కడున్న 3 4 గేట్స్ లో ఏదైనా తీసి వుందా? వుంటే అందులోంచేమైనా దూరడానికి వీలుందా? లోపలికెళ్లినా మనల్ని వుండనిస్తార? ఒక వేళ బయటకి పంపేస్తే, మర్యాదగా పంపిస్తారా? కొట్టి తరిమేస్తారా?' ఇలాంటి 100 ప్రశ్నలు ఒక్క సెకనులో ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయ్ ఏ ఒక్కదానికీ ఆన్సర్ (ఆలొ) చించే లోపే. ఇoతలొ శ్రావణ్ వచ్చాడు వస్తూ వస్తూనే, "ఆరెయ్ వెంకీగా, ఈ కుర్రొళ్లతో ఇప్పుడు పోటీ పడి టిక్కెట్స్ తీసుకోవడం అవసరం అంటావా? " అంటూ. "ఈ కుర్రోళ్లు అంటావేంట్రా, మనం కూడా యూతే !! :-), ఇట్జ్ బీన్ జస్ట్ 3 ఇయర్స్ సిన్స్ వీవ్ పాస్స్డ్ అవుట్ డ్యూడ్ !!!" అని కన్విన్స్ చేసి, గేట్ దగ్గర ఫస్ట్ రో లో ప్లేస్ సంపాదించాం ఎలాగోలా. ఆప్పుడు తీసుకున్నదే ఈ చిత్రం !!! హౌజ్జాట్ ?? :-). Then started the real disgrace to all the anxious guyz. One of the gates was opened and all the girls were receiving a royal welcome by the gateman.. ఇంకా నయం, రెడ్ కార్పెట్ వేసి మరీ పంపించలేక పొయావ్ వెధవ, నీ యంకమ్మా .....(silencer placed here for censoring) అని గేట్ బయట వున్న మేము ఎవడి టాలెంట్ వాడు చూపించాం వాడికి మాత్రం వినిపించకుండా !!! ఎట్లీస్ట్, ఓక్క గర్ల్ ఫ్రెండ్ ఐనా :P వుండి వుంతే ఎంత బావుండు అని అప్పుడప్పుడూ అనిపించినట్టే మరోసారి అనిపించింది, సీరియస్ గా !!! ఫైన్, గేట్ దగ్గర ప్లేస్ సంపాదించగానే, సినిమా చూసేసినట్టు కాదమ్మా, గేట్స్ ఓపెన్ చెయ్యగానే, ఓ డొనొవోన్ బెయిలీ, ఓ మిల్కా సింఘ్ లా దౌడు తియ్యాలి " అని అంతర్వాహిని ఘోష !!! దీని గురించే అనుకుంటా - హౌస్ పేస్టింగ్ ..... నాట్ సెర్మనీ - అని మన బాస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ లో స్టైలిష్ గా చెప్పింది !!! ఇంతలోనే మెరుపు లాంటి ఆలోచన వచ్చింది - " ఆందరూ 45/- కి ట్రై చేస్తారు, ఎనీవేస్ ది హాల్ ఫెలో విల్ సెల్ వెరీ లెస్ నంబర్ ఆఫ్ టిక్కెట్స్ ఇన్ కౌంటర్, పడిన ఇంత శ్రమా వేస్ట్ అయిపోతుంది...35/- కౌంటర్ దగ్గరగా వుంది. సో లెట్స్ గెట్ ఇంటు దట్ లైన్ " - బీన్ లాడెన్ ఎక్కడున్నాడొ అనే సీక్రెట్ ని బుష్ గాడికి చెప్పినంత సీక్రెట్ గా శ్రావణ్ కి చెప్పా ఈ ఐడియా ని. "ఓకే", శ్రావణ్ తన యూజువల్ హ్యాండ్సం స్మైల్ తో. జస్ట్ ఒక్క నిమిషం అయ్యిందనుకుంటా, వెనక నుంచి ఒక అబ్బాయి మరొకడితో పై డైలాగ్స్ అక్షరం తేడా లేకుండా రిపీట్ చేసాడు. ఓక్కసారి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది :-). శ్రావణ్ వైపు తిరిగి అన్నా - "ఆక్బర్ బీర్బల్ స్టోరీ లా వుంది కదా ?!?!? :-) " అని. హ హ హా.
10 అయ్యింది టైం. ఒక్కసారిగా అందరికీ ఏమయ్యిందో? ఏంటో మరి, చిన్నప్పుడు తాగిన బూస్ట్, హార్లిక్స్ శక్తి ఒకేసారి నిద్ర లేచినట్టు, గేట్ ని బలం గా తోసారు. గంట సేపు బయట వెయిట్ చేసిన మేము, మరో అరగంట సేపు లైన్ లో పుషింగ్స్, పుల్లింగ్స్ నడుమ పోరాడి, సక్సెస్ఫుల్ గా టికెట్స్ తో బయటపడిన నేను, సినిమా చాలా బావుండటం తో ఆ ఎక్ష్ట్రా ఎఫ్ఫర్ట్స్ అన్నిటినీ తెలియకుండానే మర్చిపోయా.
ఇదే హ్యాప్పీ డే లో చివరి మొమెంట్ అనుకుంటె పొరబడ్డట్టే. నేను రాసే ప్రతీ 5 10 లైన్ల కోడ్ లో మినిమం ఒక బగ్ వుండటం ఎంత సహజమో (:P, మా manager తో చెప్పకండే, ప్లీజ్), అంత మంచి సినిమా చూసాక, ఆ స్టార్స్ తో కలవాలనుకోవటం కూడా అంతే సహజం కదా !!! అనుకున్నదే తడవు గా వాళ్లని కలుసుకోవడం, కలుసుకోవడమే కాక మాట్లాడటం జరిగితే ?!?!?! యాహూ, you are right - I met them at IMAX in the evening and spoke with them too. ఆ విశేషాలు, సినిమా రివ్యూ నెక్ష్ట్ పోస్ట్ లో రాస్తా ... I'll leave you all here for you need to be safe for reading my next post :-) !!!!.... ఇక వుంటా !!!
తెలుగు != ఉద్యోగావకాశాలు ?? ఎల్లప్పుడూ కాదు
14 years ago
11 comments:
అప్పచ్చి అయిపోయారాబాబూ ! ఆరోజు క్యూ లొ.
ఏదైతేనేం, మంచి సినిమా కదా.
బాగా రాసావు.
keep blogging.....
-Sravan
heay,,,venki bagundi ni blog kaani,,,,abbaddalu kakunda nijalu raaste bagunnu..
niku okka girl friend kuda leru ante nenu nammanu.....aa roju bakery ki enduku vellavu mari?????
Baaundi venki ..kallaku kattinaattu raasavu....neelanti vallu kooda first day first show ki kashtapadi velli cinema choose bhagyam telugu cinema ki vachindannamata...good for the industry...
Pls dont reveal the details of the movie in next post...i am planning to watch it when i go home next month..ofcourse i would love to read your expert comments on it though...:-)
Venki....
welcome to the world of blogging...meeru unbeatable lendi...
meeru story writing lo expert kadha!!! ;)
Good post venky....
Keep rocking!!
బ్లాగ్లోకానికి స్వాగతం వెంకి. నీ శైలిలో మొదలుపెట్టడం బావుంది.... ఇలానే రాస్తూవుండు....
Baasu... Girlfriends leru leru antoone mugguru ammayilachetha comment rayinchukunnav ga...
So nuvvu cheppindi abaddamannamata :P
@ శ్రావణ్,
హ హ హ. థాంక్యూ రా, నీ ప్రోత్సాహమే నాకు కొండంత ఉత్సాహం :-).
@ సునీతా,
నువ్వే నమ్మను అంటే ఇక నన్నెవరు నమ్ముతారు చెప్పు? నేను రాసింది అంఫార్చ్యునేట్లీ :-( అక్షరాలా సత్యం !!!
@ శ్రీ,
థాంక్యూ. యాక్చ్యువల్ గా మంచి రోజులు శేఖర్ లాంటి దర్శకుల వలన వచ్చాయి అంటె ఆప్ట్ గా వుంటుందేమో? ఏమంటావ్?
@ సుప్స్,
థాంక్స్ ఎ లాట్ అమ్మాయ్ ( ??? క్వచ్చన్ మార్క్స్ ఫర్ ది లాస్ట్ వర్డ్), [:-P], జస్ట్ కిడ్డింగ్. హ హ హ, నా గురించి బాగా తెల్సు కదా నీకు. నువ్ వున్న మరి ఆ ఓ రోజుల్లో, నేను మా ఓనర్ కి రాసిన లెటర్ గుర్తొచ్చిందా ??? ఆ రోజు నవ్వీ నవ్వీ అయిపోయా అనుకున్నా !!..
@ హర్షా,
ఛాలా హ్యాప్పీ బాసూ, నా బ్లాగ్ ని నువ్ చదవటం, అప్రిషియేట్ చెయ్యడం - ఐ రియల్లీ ఫీల్ ప్రివిలిజ్డ్. థాంక్యూ వెరీ మచ్.
ఇక చివరిగా @ అనోనిమస్,
వీళ్లందరూ జీవితం అనే నా ఈ మజిలీ లో మంచి మిత్రులు బాసూ, ఫ్రెండ్స్ హు ఆర్ గర్ల్స్ :-). !!! ఎనీవేస్, కామెంట్స్ తో సహా చదివినందుకు :-) చాలా థాంక్స్.
ee weekend try chesaamraa dorakaledu.. Hope the movie is as good as it is made out to be..
I liked the "Arerey.." song very much.. Hv to c how Kammula picturized it.
And welcome to the blogging world.
Nee laanti youth raasthe comment cheytam thappa, swatahaagaa raasey opika kolpaayaa....
Keep Writing regularly. Once u stop, you stop forever.
మీ బ్లాగు బాగుంది.కొంచం కామిడిగా ఉంది.నేను కూడ ఒక బ్లాగు రాశాను.తీరిక చూసుకొని చదవగలరని ప్రార్ధన.
I read your blog, and i feel it is very good. Keep up the work, and dont stop writing. As your friend said,once you stop, you stop for ever. This is my own experience also. I always wanted to write new blogs but i could not. BTW i saw your profile in orkut from the link you gave here and i am surprised to see my brother in your friend list. I guess you are his batchmate in NIT. Bye and all the best to you.
బ్లాగ్లోకానికి స్వాగతం.మీ బ్లాగు బాగుంది
Post a Comment