Wednesday, November 21, 2007

అంధ్రా అందాలు - అత్యంత సుందరంగా !!!

చల్లని గాలి, ఆ గాలికి వయ్యారం గా కదలాడే పచ్చని పొలాలు, గలగలా పారే సెలయేళ్లు, వినీల ఆకాశం, విశాలమైన సముద్రం, సుదూర తీరాల వరకు విస్తరించిన ఇసుక తిన్నెలు, సూర్యోదయపు వేళ భానుడి బంగారు వన్నెలు, కనుచూపుమేర కనిపిస్తూ, మనం తప్ప మరొకరు లేని పొడవాటి రోడ్డు, అ రోడ్డుకిరువైపులా ఏపుగా పెరిగిన చెట్లు ... ఇవీ మన 'అతి సుందర అంధ్రా' (or అమేజింగ్ అంధ్రా - 'ఇన్ క్రెడిబుల్ ఇండియా' అనే పదం ఇన్స్పిరేషన్ తో ) అందాలు. వింటే కాదు చూస్తే మరింత బావుంటుంది అనుకుంటున్నారా? అనుకోవాలే గానీ, కానిదంటూ ఏముంది? తనివి తీరా చూడండి మరి. దానికి ముందు మాత్రం ఆ అందాల్ని అత్యంత మనోహరం గా తన కెమెరా లో బంధించిన బాలు (and తన friend) కి (బాలూ, IIM A కెళ్లి MBA చెయ్యమంటే, నువ్ అక్కడ photography నెర్చుకున్నావన్నమాట !!!) థ్యాంక్స్ చెప్పడం మర్చిపోకండే. :-) బాగున్నాయి అనిపిస్తే, మీ అనుభూతిని పంచుకోవటం - తనకి మెయిల్ చేసి అయినా, లేక, ఇక్కడ పోస్ట్ చేసి అయినా* - మానుకోకండే !!! :-). ఇలాంటివే, మీకు తెలిసినవి మరిన్ని వుంటే, లింక్ పోస్ట్ చెయ్యండే :-) ...

* No conditions Apply :-)

http://picasaweb.google.com/balareddyv/EmbarkingOnASojurn.