"పాటలు వింటూ ప్రొగ్రాంస్ రాస్తే అలుపూ సొలుపేమున్నదోయ్" అనుకుంటూ ప్రొగ్రాం రాసుకుంటున్న రోజులవి ! అంతలో, 'అరెయ్, ఈ linked lists గురించి కొంచెం చెప్పరా వెంకీ' అంటూ వచ్చాడు నా ఫ్రెండు ఫంకీ ! మనకి తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత అయినప్పటికీ, పరువు పోకూడదు కదా అని, నాకొచ్చిన నాలుగు ముక్కలూ చెప్దామని ముందుకురికా. మరోపక్క, ఆప్పటికే శిధిలావస్థకి చేరుకున్న ట్రాన్సిస్టర్ లో చిత్రం, నువ్వే కావాలి, నువ్వే నువ్వే, మనసంతా నువ్వే తదితర సినిమాలలోని మెలొడీ సాంగ్స్ నడుస్తున్నాయి !!! ఓ గంట సేపు గడిచాక, తనకొచ్చింది కూడా మర్చిపొయేలా చెప్పె నా explanation skills కి మా వాడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది !!! ప్రేమంటే సులువు కాదురా అనే పాట రన్ అవుతూ వుంది ఆ సమయానికి. మా situation కి దానిని అన్వయిస్తూ, 'ప్రొగ్రామింగ్ సులువు కాదురా, అది నీవు చెయ్యలేవు రా' అని అందుకున్నాడు ఫంకీ !!! 'ప్రొగ్రాం లో పజిల్ ఏమిటో?, అందులోని మర్మమేమిటో?!' అని దానికి నేను జోడించాను! పేరడీ పాటలు రాసే వూపులో వున్న మేము, మా రూమీస్ సతీష్, కామేష్ కొన్ని పదాలు అందించటం తో ఈ క్రింది పారడీ రాసాము. ఆ తర్వాత, ఈ ఆరేళ్ళలో దీనిని చాలా మంది విని 'చాలా బావుంది ' అని అన్నారు! మీకు కూడా నచ్చుతుంది అని ఆశిస్తూ ....... (పేరడీ లొని ముఖ్య విషయం ఏంటంటే, ఓరిజినల్ సాంగ్ లో, హీరొయిన్ - ఫలాన ఫలానా చెస్తావా అని అదిగితే, హీరో - వాటికంటే సుపీరియర్ వి చేసి చూపిస్తా అని అంటాడు. మీరు గమనిస్తే, ఆదే స్ట్రక్చర్ ని ఫాలో అవుతూ రాసిన పాట ఇది !!! ఉదాహరణకి, SWITCH అనేది IF కి, FOR అనేది WHILE కి సుపీరియర్ అయినట్టు)
ప్రొగ్రామింగ్ సులువు కాదురా
అది నువ్వు చెయ్యలేవురా
ప్రొగ్రాం లో పజిల్ ఏమిటో?!
అందులోని మర్మమేమిటో?!
C ఎంతో సెక్సీగుంటదీ
అందరికీ అర్థం కానిదీ
చూసేందుకు టెర్రరయితదీ
రాసావా ఎర్రరుంటదీ ....
నో నో నో అలా చెప్పకు
లాజిక్ వుంటే ప్రొగ్రాం వస్తదీ
సయ్యంటే చేసి చూపుతా
ప్రొగ్రాంస్ నే రాసి పారెస్తా ...
IF తో ని కండీషన్ రాస్తావా
WHILE తో నువ్ లూపులు చేసీ చూపిస్తావా
C లోని ప్రొగ్రాంస్ రాసిస్తావా
STRUCTURES ని వాడి చూపిస్తావా ... ఇస్తావా?...రాస్తావా? రాస్తావా?
SWITCH లతో షేక్ చేసెద
FOR మీద ఫోకస్ చెసెద
C++ వాడి చూపెద
CLASSలతో కలియదిప్పుతా ...
ప్రొగ్రామింగ్ సులువు కాదురా
అది నువ్వు చెయ్యలేవురా
.........
.........
తెలుగు != ఉద్యోగావకాశాలు ?? ఎల్లప్పుడూ కాదు
14 years ago