Saturday, October 25, 2008

తారాస్థాయి

ఆప్పుడెప్పుడో మ్యూజిక్ క్లాసు లో పరిచయం అయిన ఒక అమ్మాయి మొన్న ఈ మధ్య హఠాత్తుగా గుర్తొచ్చింది ! అఫ్కోర్స్, ఇక్కడో చిన్న ట్విస్ట్ వుంది [:P] అనే విషయాన్ని పక్కన పెడితే, వెన్నెలకంటి అనే తన ఇంటి పేరు కి తగ్గట్టు గా చంద్రుడిలా చాలా ప్రశాంతం గా, చక్కని చిరునవ్వుతో, అంతే అందమైన కళ్ళతో పదానికి ప్రాణం పోసినట్టుగా వుండేది తను. వెంటనే మెయిల్ రాసా, హౌ ఆర్ యు డూయింగ్? అని. రెండు రోజుల తర్వాత, రిప్లై వచ్చింది. సబ్జెక్ట్: వెడ్డింగ్ ఇన్విటేషన్, అని !!!! నేను మాట్లాడుదామని వెళ్తే, 'ఈ రోజు నేను మౌన వ్రతం' అని అన్న వాళ్ళని చూసా, నేను ఆన్లైన్ రాగానే, ఇన్విజిబుల్ మోడ్ లోకే కాదు, 'అమ్మో! వీడు, నిను వీడని నీడను నేనే అన్న టైప్' అని అనుకుని, కంప్యూటర్ కట్టేసి మరీ పారిపోయిన వాళ్ళ గురించి విన్నా, కానీ ఇలా వెడ్డింగ్ ఇన్విటేషన్ తో (రెప్లై) కొట్టడం మొదలయ్యింది అంటే, మన హింస, మన గురించి ప్రశంస దశ దిశలా ప్రాకి తారా స్ఠాయి కి చేరుకుంది అన్నమాట అని అనిపించింది !! :-(. 'కర్ణ ఖఠోరమైన మన మ్యూజిక్ తో జనాల్ని ఇంత దారుణంగా హింసించామా??!?!?!?!! నాకసలు అలా అనిపించలేదే మచ్చుకైనా, I absolutely had no clue, you know!!!' అని అనిపించింది......ఒక సారి రీల్ గిరగిరా గిరగిరా వెనక్కి తిప్పితే, ఆ రోజుల్లో మరి మా సార్ తో కలిసి మనం, మనసా వాచా, రూబరూ, పెహ్లా నషా, చివరికి మన Happy Days లోని, అంతా నీ మాయలోనే అంటూ ప్లే చేస్తూ వుంటె, ఆ మాయలో పడి, అంత వరకూ పియానొ, తబలా, తప్పెడగుళ్ళు తదితర ఇన్స్ట్రూమెంట్స్ నేర్చు కుంటున్నఅబ్బాయిలు, వర్ణనాతీతమైన అదంతో వేరే వాళ్ళతో సెటిల్ అయిపోతూ వుండిన [:(] అమ్మాయిలు 'నేను సైతం' అంటూ, సమైక్యం గా తర్వాతి రొజు నుంచీ గిటార్ క్లాసులొ చేరటానికి లైను కట్టిన వైనం గుర్తుకొచ్చి, 'అబ్బే, ఆ రీసన్ అయి వుండదు లే' అని సరిపెట్టుకుని, మళ్ళీ మా రూమీ రాజేష్ కి ' ఆపరేషన్ టార్చర్ ' మొదలెట్టా నా సిక్స్ స్ట్రింగ్ తో [:)] !!! ఏనీవేస్, 'The best wishes of a very happy married life to my friend' !